విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే దివ్యాంగుడు ఉన్నాడు. ఈయనకు భార్య మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. అయితే, వెంకటేశ్ పెద్ద కుమార్తె చెన్నైలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా.. చిన్న కుమార్తె ఇంటి వద్దే ఉంటూ పదకొండో తరగతి చదువుతోంది.
ఈ క్రమంలో జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ దాఖలు కోసం వెళ్లి వచ్చిన వెంకటేశ్ తన ఇంట్లో విగతజీవిగా కనిపించాడు. బంధువులు, స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహంపై కత్తి పోట్లను బట్టి.. తొలుత రాజకీయ హత్యగా భావించారు.
అయితే కేసు నమోదు చేసిన పోలీసులు... లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. వెంకటేష్‌ను రెండో కుమార్తె హత్య చేసినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చి ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దర్యాప్తులో 'నా తండ్రి లైంగికంగా వేధించాడు.. ఆత్మరక్షణ కోసమే చంపేశాను' అని ఆమె చెప్పినట్లు డీఎస్పీ ఇళంగోవన్ తెలిపారు.