రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రధానంగా చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూర్ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో ఈనెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా అధికంగా ఉన్న జిల్లాలో మదురై కూడా చేరింది. ఆదివారం ఒకేరోజు జిల్లాలో 68 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 705కు పెరిగింది.
ఈ క్రమంలో మదురైలో కరోనా నిరోధక చర్యల్లో భాగంగా బుధవారం నుంచి దుకాణాలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరచి ఉంచాలని వ్యాపార సంఘాలు నిర్ణయించారు. అదే సమయంలో దుకాణాల ముందు ప్రజలు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దని జిల్లా ఎస్పీ మణివన్నన్ విజ్ఞప్తి చేశారు.