సుధాకర్ అనే డ్రైవర్ ఇటీవల మారుతి కంపెనీకి చెందిన ఈకో మోడల్ కారు కొన్నాడు. పూజల కోసం దాన్ని కడలూర్‌లోని ఓ ఆలయానికి తీసుకొచ్చాడు. వాహన పూజలన్నీ పూర్తయ్యాక కారును స్టార్ట్ చేశాడు. అంతే ఒక్కసారిగా అది ముందుకు దూసుకెళ్లింది. ఆలయం ఆవరణలో ఉన్న రెండు మెట్లపై నుంచి ఎగిరిపడి గుడి రాజగోపురం నుంచి బయటకు దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఈ వీడియోను ఒకరు ట్విట్టర్ పోస్టు చేయడంతో దీనిపై సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్ తొలి రోజే ఆఫ్ రోడింగ్‌కు ప్రయత్నించాడంటూ ఓ యూజర్ కామెంట్ పోస్టు చేశారు. మరొకరేమో మొదటి రోజే కారుకు ఇన్సూరెన్స్ అవసరం ఏర్పడిందంటూ పోస్టు చేశారు. మరొకరేమో కారును దేవుడు మరింత దగ్గరగా చూడాలనుకున్నట్లున్నాడంటూ పేర్కొన్నారు.