కరోనా వైరస్ కారణంగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆన్ లైన్ క్లాసుల కోసం విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు లేకుండా... నెట్ లేకుండా నానా తంటాలు పడుతున్నారు. ఇటీవలే స్మార్ట్ ఫోన్ కొనిపెట్టలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా ఆన్‌లైన్ తరగతులు అర్ధం కాకపోవడంతో బీఈలో చేరిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.