ట్యాక్సీ డ్రైవర్-2 గేమ్‌ ప్రభావం.. 10 రోజులు స్నానం చేయకుండా.. ఆ బాలిక?

సోమవారం, 22 జులై 2019 (18:30 IST)
ఉత్తరాఖండ్, ఉత్తమ్ సింగ్ నగర్ జిల్లాలో ఈ నెల 15వ తేదీన ఓ బాలిక అదృశ్యమైందని అందిన ఫిర్యాదు మేరకు జరిపిన విచారణలో పోలీసులకు షాకిచ్చే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బాలికను గాలించే పనుల్లో పడిన పోలీసులకు.. ఢిల్లీలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌లో గొడవకు దిగిన బాలిక కంటపడింది.
 
ఆ బాలిక వద్ద విచారణ జరిపిన పోలీసులకు ఆ బాలిక ఉత్తరాఖండ్‌కు చెందిందని తేలింది. ఆపై ఆ బాలిక తల్లిదండ్రులను రప్పించారు. కానీ ఇంతలో జరిపిన విచారణలో బాలిక చెప్పిన విషయాలు పోలీసులకు షాకిచ్చేలా చేశాయి. 
 
ట్యాక్సీ డ్రైవర్-2 అనే గేమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆడిన ఆ బాలిక ఆ గేమ్‌కు బాబా అడిక్ట్ అయ్యింది. ప్రయాణీకులను ఎక్కించుకుని వారిని భద్రంగా ఇంట్లో డ్రాప్ చేసే ఆ గేమ్‌లోని అన్నీ లెవల్స్‌ను ఆ బాలిక ఆడింది. కానీ ఆ గేమ్ ద్వారా మానసికంగా ఇబ్బంది పడిన బాలిక ఆ గేమ్‌లాగానే జీవించాలనుకుంది. 
 
అలా కారులో ప్రయాణం చేసేందుకు గాను 12వేల రూపాయలతో ఉత్తరాది రాష్ట్రాలను చుట్టి వచ్చేసింది. ఇలా స్నానం చేయకుండా పది నగరాలు చుట్టొచ్చిన ఆ బాలిక రైళ్లు, కార్లలో ప్రయాణం చేస్తూ వచ్చింది.

ఫోన్ ఆధారంగా పట్టుకోవాలని చూసినా.. ఆ బాలిక దొరకలేదు. చివరికి ఢిల్లీలో ఆమెను కనుగొన్నారు. ఇంకా ఆ బాలిక గంటలు గంటలు సెల్ ఫోన్‌ను చేతిలో పట్టుకుని తిరిగేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు