యూనివర్సిటీలలో అక్టోబరు చివరి నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:44 IST)
ప్రతిభ, ప్రవేశ పరీక్షల ఆధారిత అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబరు చివరి నాటికి పూర్తి చేయాలని, నవంబరు 1 నుంచి డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని దేశంలోని అన్ని యూనివర్సిటీ లను యూజీసీ ఆదేశించింది.
ఈ మేరకు యూజీసీ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విటర్ ద్వారా తెలియజేశారు.
ఒకవేళ ఏవైనా పరీక్షల ఫలితాల విడుదలలో జాప్యం జరిగితే నవంబరు 18 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారం భించుకోవచ్చని వర్సిటీలకు యూజీసీ సూచించింది యూజీసీ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మిగిలిపోయిన సీట్లను వర్సిటీలు నవంబరు 31లోపు భర్తీ చేసుకోవచ్చు.