తీసుకున్న నిర్ణయాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి, చిన్నచిన్న మొత్తాలలో రుణాలు తీసుకున్నవారికి లబ్ధి చేకూరేలా, అన్ని నియమనిబంధనలకు అనుగుణంగా, నిర్ణయాలు తీసుకునేందుకు సమయం కావాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కేంద్రం వాదనలతో ఏకీభవించని సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
సొలిసినటరీ జనరల్ కోర్టుకు సమాధానం ఇవ్వగా కేంద్ర నిర్ణయం అమలుపై సామాన్యుల్లో ఆందోళన నెలకొని వుందని, “సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే ఉంది’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి జస్టిస్ ఎమ్.ఆర్. షా వ్యాఖ్యానించారు.