ఢిల్లీకి చెందిన ఓ యువతి కోవిడ్ వైరస్ బారినపడినప్పటికీ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. చేతికి సెలైన్ పేపు, నోటికి ఆక్సిజన్ పైపుతో ఒకవైపు కోవిడ్ రోగులు.. మరోవైపు కోవిడ్ మృతుల మధ్య ఉంటూ కూడా ధైర్యంగా కరోనా చికిత్స చేయించుకుంది. అలాంటి ధీరవనిత గుండె ఆగింది. ఆమెకు కోవిడ్ చికిత్స ఫలించక కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమెకు చికిత్స చేస్తూ వచ్చిన వైద్యురాలు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, చేతికి సెలైన్ ఎంచుకుంటూ, నోటికి ఆక్సిజన్ పైపు తగిలించుకుని కోవిడ్ రోగుల మధ్య హాస్పిటల్‌లో చికిత్స పొందిన 30 యేళ్ళ యువతి... ఆస్పత్రి బెడ్ మీద భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పాటలు వింటూ ఆనందంగా కనిపించింది.