నాగ్‌పూర్ జిల్లాలో ఆదాయపు పన్ను కమిషనర్‌పై అత్యాచారం కేసును పోలీసులు నమోదు చేసారు. మహిళా వైద్యురాలిని వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడని, ఆమెకు బలవంతంగా గర్భస్రావం కూడా చేశాడని తెలిపారు.
తరువాత, నిందితుడు ఆమెను వివాహం చేసుకోవాలనే నెపంతో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అతను ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడని, ఆమె అశ్లీల ఫోటోలను కూడా తీసి బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపారు. ఆ మహిళ గర్భవతి అయినప్పుడు, ఆమెను గర్భస్రావం చేయమని ఒత్తిడి తెచ్చాడు.
ఆమె పెళ్లి కోసం పట్టుబట్టడంతో బాధితురాలితో బెడ్రూంలో గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని నిందితుడు బెదిరించాడని అధికారి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (2) కింద అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. నిందితుడిని బెంగళూరులో పోస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా అతడిని ఇంకా అరెస్టు చేయలేదనీ, కేసు దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.