కన్న కూతుర్ని పెన్సిల్‌తో పొడిచి హింసించిన తల్లి, ఎక్కడ?

శనివారం, 24 అక్టోబరు 2020 (16:58 IST)
కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల చదువులు అంధకారంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్స పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను ప్రారంభించింది. ఆన్ లైన్ క్లాసులు విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉన్నా కొంతమంది మాత్రం పలు ఇబ్బందులకు గురవుతున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
 
ఇలాంటి తరుణంలో ఓ హింసాత్మక చర్య వెలగులోకి వచ్చింది. ఆన్లైన్ క్లాసులకు సరైన సమాధానం చెప్పలేదని కన్నకూతిర్ని పెన్సిలుతో 12 సార్లు పొడిచింది ఓ తల్లి. ఆరో తరగతి చువుతున్న ఓ బాలిక ఇంట్లో వర్చువల్ పద్దతిలో క్లాసులు వింటోంది. ఆ సమయంలో టీచర్ ఆ బాలిక దగ్గర కొన్ని ప్రశ్నలు అడిగింది.
 
బాలిక సరైన సమాధానం చెప్ప కపోవడంతో ప్రక్కనే ఉన్న బాలిక తల్లి కోపం వచ్చి ఇలా కర్కశంగా ప్రవర్తించింది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయాలపాలయ్యింది. దీంతో ఆ బాలిక సోదరి భయపడి తెలివిగా హెల్ప్ లైన్ నెంబరుకు ఫోన్ చేసింది. దీంతో ఎన్జీవో ప్రతినిధులు ఆమె ఇంటికి చేరుకొని ఆమెను గట్టిగా మందలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై లోని శాంతాక్రజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకున్నది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు