గొగోయ్ పై విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (09:47 IST)
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్ పై కుట్ర జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పేర్కొంటూ.. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల విచారణను సుప్రీంకోర్టు మూసివేసింది. గొగోయ్ నిర్ణయాలు, నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ (ఎన్‌ఆర్‌సి)పై ఆయన అభిప్రాయాలు, సుప్రీంకోర్టు రిజిస్ట్రీని క్రమబద్దీకరించడం వంటి చర్యల కారణంగా ఆయనపై కుట్ర జరిగే అవకాశాలున్నాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

జస్టిస్‌ పట్నాయక్‌ కమిటీ, సీజేఐ ఎస్‌ఏ బోబ్డేల నేతఅత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్‌ సంజయ్ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వెల్లడించింది. కాగా, మాజీ సిజెఐపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిమిత్తం ఈ కమిటీని ఏర్పాటు చేయలేదని, న్యాయమూర్తులపై కుట్ర కోణం జరుగుతుందన్న వార్తల నిమిత్తం దర్యాప్తు చేయడానికి కమిటీని నియమించినట్లు కోర్టు వెల్లడించింది.

రెండేళ్లు గడిచినా ఈ కేసులో ఎలక్ట్రానిక్‌ ఆధారాలు చేతికి అందలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసును మూసివేస్తున్నామని, నివేదికను సీల్డ్‌ కవర్‌లో ఉంచాలని పేరొకంది. కాగా, రంజన్‌ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2019లో సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తద్వారా ఆయన తన భర్తను, ఇతర కుటుంబసభ్యులను బాధితులుగా మార్చారని ఆమె పేర్కొని సంచలనం సఅష్టించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు