మూడేళ్ల పాపపై యువకుడి అత్యాచారం.. కాశ్మీర్‌లో దారుణం

గురువారం, 9 ఏప్రియల్ 2020 (11:41 IST)
లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. కామాంధులు మాత్రం వయో బేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఈ రాంబన్ జిల్లాలో కేవలం మూడేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రాంబన్ జిల్లాలో ఓ కుగ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి బుధవారం ఇంటి బయట ఆడుకుంటుండగా ఆ పాపని చాక్లెట్లు ఇస్తానని  చెప్పి... తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికను గదిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడు. దీనితో ఆ చిన్నారి ఏడుపు విన్న తల్లి వెంటనే అతని ఇంటికి వెళ్లగా అక్కడ ఉన్న నిందితుడు పరారయ్యాడు. 
 
బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికుల సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్లు ధ్రువీకరించడంతో పోలీసులకు పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఫోక్సో చట్టం కింద నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు