కాళ్ల పారాణి ఆరలేదు.. నవవధువు ఆత్మహత్య.. భర్త ఏం చేశాడో తెలుసా?

బుధవారం, 27 జూన్ 2018 (10:03 IST)
కాళ్ల పారాణి కూడా ఆరకముందే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నవవధువు ఆ ఇంట విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన తమిళనాడులోని ఆర్కేపేటలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకాలోని రంగాపురానికి చెందిన సంపత్‌రెడ్డి కుమార్తె అర్చనాదేవి (21)కి నెల రోజుల క్రితం వేలూరు జిల్లా పుదూరుకు చెందిన తంగరాజుతో వివాహమైంది. 
 
కానీ మరో యువతి ప్రేమలో మునిగి తేలుతున్న తంగరాజు ప్రియురాలితో కలిసి పారిపోయాడు. అవమాన భారంతో అర్చన పుట్టింటికి చేరుకుంది. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు