తాము ప్రజల కోసం పాటుపడుతుంటే... దినకరన్ సొంత కుటుంబం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. కార్యకర్త స్థాయి నుంచి తాము అన్నాడీఎంకే పని చేశామని గుర్తు చేశారు. పనిలో పనిగా ఓపీఎస్ కూడా దినకరన్‌పై దుమ్మెత్తిపోశారు. అన్నాడీఎంకేలో తాను సీనియర్ నని, దినకరన్ ఓ ఎల్ కేజీ విద్యార్థిలాంటి వాడని ఎద్దేవా చేశారు.
ఊటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈపీఎస్ మాట్లాడుతూ, అమ్మ పుట్టిన రోజు ఫిబ్రవరిలో రానున్న నేపథ్యంలో సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, సంక్రాంతికి పచ్చిబియ్యం, బెల్లం కిట్ అందజేస్తామని ప్రకటించారు. అమ్మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.