చిదంబరం నటరాజస్వామి ఆలయ సంపద వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. తమిళనాడు హిందూ మత ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్‌అండ్ సిఇ) శాఖ చిదంబరం నటరాజ ఆలయానికి చెందిన వారి ఖాతాలు, ఆస్తుల వివరాలను తమ వద్ద ఉంచాలని కోరుతూ వారికి నోటీసులు పంపింది.
ఆలయ ఆస్తుల వివరాలను జూన్ 7 , 8 తేదీల్లో తెలిపాలని నోటీసుల్లో పేర్కొంది. ఆలయంలోని కనగసభలో దర్శనం పునఃప్రారంభించాలంటూ హెచ్‌ఆర్ అండ్ సీఈ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై దీక్షితులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే.. నటరాజస్వామి ఆలయ ఆస్తుల వివరాలు, ఆదాయం, ఖర్చుకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలని నోటీసులను పంపించడంపై దీక్షితుల వర్గం తప్పుపడుతున్నాయి. నటరాజస్వామి ఆలయ సంపదఫై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదంటూ తేల్చి చెప్పారు.