భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. అక్రమ సంబంధాల కోసం చేసే నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా పెళ్లైన 43 రోజులకే ఓ భర్త తన భార్యను గొంతు కోసి హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలం జిల్లా వీరాణం ఒరత్తరు పట్టిలో చోటుచేసుకుంది. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న వీరానం పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు.
పోలీసుల విచారణలో గత నెల 24వ తేదీన మోనీషా మేనత్త కుమారుడు మోనీషా పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇవ్వడానికి వచ్చివెళ్లాడు. దీంతో తంగరాజ్ భార్య మీద అనుమానంతో వేధించడం మొదలెట్టాడు. ఆ అనుమానంతోనే భ్యార మోనీషాను తుంగరాజ్ గొంతు కోసి హతమార్చి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. భార్యను చంపిన తర్వాత తంగరాజ్ విషం తాగి, ఆ తర్వాత ఉరి వేసుకున్నట్టు విచారణలో వెలుగు చూసిందని పోలీసులు పేర్కొన్నారు.