పండగ పూట ఉల్లిఘాటు... లబోదిబోమంటున్న సామాన్య ప్రజలు

ఆదివారం, 22 అక్టోబరు 2023 (09:33 IST)
మొన్నటివరకు టమోటా ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒక కేజీ టమోటాలు ఏకంగా రూ.400 వరకు పలికాయి. ఆ తర్వాత దిగుబడి పెరగడంతో టమోటా ధరలు క్రమంగా కిందకు దిగివచ్చాయి. ఇపుడు పండుగ వేళ ఉల్లిఘాటు నషాళానికి తాకుతుంది. వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. నిన్నామొన్నటివరకు కాస్త తక్కువగా ఉన్న వీటి ధరలు ఇపుడు మార్కెట్‌లో రూ.45 నుంచి రూ.50 వరకు చేరుకున్నాయి. దీంతో కూరగాయలు, నిత్యావసర ధరలు మరోమారు పెరుగిపోతున్నాయని సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలోని రానుల్, బళ్లారి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ఉల్లి సరఫరా అవుతుంటుంది. అయితే ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉల్లి ఉత్పత్తిపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 
 
మరోవైపు కొత్త దిగుబతి ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమవుతోంది. విశాఖపట్నంలో కేజీ ఉల్లి రూ.50 పలుకుతోంది. ఇక రైతుబజార్లో రూ.40గా ఉంది. కర్ణాటకలో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి వ్యాపారులు కొనుగోలు చేయాల్సి వస్తుండడం కూడా ఒక కారణంగా ఉంది. కాగా కొత్త ఉల్లి నవంబర్ నెలలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పటివరకు ఉల్లి ధరల ఘాటును సామాన్యులు భరించడం తప్పేలా కనిపించడం లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు