రైలు బోగీలపై నడిచిన యువకుడు - హైటెన్షన్ విద్యుత్ వైరు తగ్గి... (Video)

ఠాగూర్

ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (10:26 IST)
కొందరు యువకులు చేసే పనులు చివరకు ప్రాణాలమీదికి తెచ్చుకుంటుంటారు. కొందరు సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోతుంటే మరొందరు మూర్ఖంగా ప్రవర్తించి చనిపోతున్నారు. తాజా ఓ యువకుడు రైలు బోగీలపై నడిచాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ వీడియో మాత్రం వైరల్ అయింది. 
 
ఓ యువకుడు రైలు బోగీపైకి ఎక్కి నడుచుకుంటూ వెళుతున్నాడు. అతన్ని చూసిన కొందరు ఎంత అరిచినా ఏమాత్రం పట్టించుకోలేదు. అలా నడుచుకుంటూ వెళుతుండగా రైలుపై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్లు తగులుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

రైలుపై నడిచిన యువకుడు.. చివరకు అతడి పరిస్థితి

ఓ యువకుడు రైలు పైకి ఎక్కి నడుస్తూ వెళ్తున్నాడు. కింద నుంచి ఎవరు ఎంతలా అరిచినా అదేమీ పట్టించుకోకుండా ఒక వైపు నుంచి మరో వైపునకు నడుస్తున్నాడు. ఈ క్రమంలో రైలుపై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్లు తగులుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో… pic.twitter.com/q6P3aklklw

— ChotaNews App (@ChotaNewsApp) April 20, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు