కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే పద్మ పురస్కారాలను 2021 సంవత్సరానికి మంగళవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో ట్రాన్స్‌జెండర్, జానపద నృత్యకారిణి మాతా బీ మంజమ్మ జోగతి కూడా ఉన్నారు. ఈమె పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు.
కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గా మంజమ్మ జోగతి గుర్తింపు పొందారు. అవార్డు అందుకునే సమయంలో మంజమ్మ జోగతి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తనదైన రీతిలో ఆశీర్వదించారు. తన పైట కొంగుతో మూడుసార్లు రాష్ట్రపతికి దిష్టితీసి, ఆ తర్వాత పాదాబివందనం చేశారు.