మార్కెట్‌లోకి కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చే ప్రతి కంపెనీ చేసేది ప్రజలను తిమ్మిని బమ్మిని చేసి మాయచేసి ఏదో ఒకరకంగా తమ వస్తువును కొనేలా చేయడమే కదా. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న బాబా రామ్ దేవ్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే తిన్నట్లున్నారు కానీ లింగమార్పిడి చేసుకున్న ఒక మహిళ మాత్రం ఇటీవల బాబా రామ్ దేవ్‌కి జలక్ ఇచ్చింది.
విషయానికి వస్తే లాక్మె ఫ్యాషన్ వీక్ ర్యాంప్‌పై నడిచిన తొలి ట్రాన్స్‌జండర్ అంజలి లామా గురించి అందరికీ తెలుసు. నేపాల్‌కు చెందిన 32 ఏళ్ల అంజలి లింగమార్పిడి చేయించుకుని మోడల్‌గా మారింది. ఆర్థిక స్తోమత లేమి కారణంగా ఖరీదైన బ్యూటీ బ్రాండ్స్ కొనలేనని చెబుతున్న అంజలికి తక్కువ ధరకు దొరికే పతంజలి ఉత్పత్తులు అంటే ఇష్టమట.