ఆ తర్వాత అన్ని బోగీల్లో టికెట్ల తనిఖీలు పూర్తయ్యాక తన బెర్తు వద్దకు వచ్చిన టీటీఈ బెర్తులు ఖాళీ లేవని తన బెర్తునే షేర్ చేసుకుందామని అమ్మాయికి చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఆ యువతి సమ్మతించింది. ఆ తర్వాత రైలు బోగిలోని లైట్లన్నీ ఆర్పేసిన టీటీఈ నానక్ సింగ్ తన బెర్తును షేర్ చేసుకున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి.. టీటీఈని చెప్పుతో కొట్టి... రైల్వే పోలీసు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేసింది. దీంతో రైలు కాన్పూర్ రైల్వే స్టేషనులో ఆగగానే టీటీఈని పోలీసులు అదుపులోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాయి ఫిర్యాదు మేర రైల్వే ఉన్నతాధికారులు కీచకుడైన టీటీఈ నానక్ సింగ్‌ను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.