మహారాష్ట్రలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. స్పీకర్‌పై దాడ?

సోమవారం, 5 జులై 2021 (17:04 IST)
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. స్పీకర్ చాంబరులో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌తో బీజేపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. 
 
ఈ కారణంగానే వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు తీసుకువచ్చిన తీర్మానానికి ఆమోదం లభించింది. 
 
సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల్లో సంజయ్ కుటే, ఆశిష్ షేలార్, అభిమన్యు పవార్, గిరీశ్ మహాజన్, అతుల్ భట్కాల్కర్, పరాగ్ అల్వానీ, హరీశ్ పింపాలే, రామ్ సత్పుతే, విజయ్ కుమార్ రావల్, యోగేశ్ సాగర్, నారాయణ్ కుచే, కీర్తికుమార్ బంగ్దియాలు ఉన్నారు. 
 
వీరిపై స్పీకర్ చర్య తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యేలు స్పీకరుపై కూడా భౌతిక దాడికి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. రెండ్రోజుల వర్షాకాల సమావేశాల నిమిత్తం మహారాష్ట్ర అసెంబ్లీ సోమవారం సమావేశం కాగా, తొలిరోజే వాడీవేడి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు