వివరాల్లోకి వెళితే.. రొమేనియాలోని ప్లోయిస్టి నగరంలో ఉంటున్న ఆండ్రియా అనే మహిళ తన ఇంట్లో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లో బిజీగా ఉంది. ఈ సమయంలో ఆమె కవల పిల్లలు ఆడుకుంటూ 10వ అంతస్తు నుంచి కింద పడ్డారు. అయినా ఆండ్రియా లైవ్ స్ట్రీమింగ్‌లో బిజీగా ఉండిపోయింది. పిల్లల గురించి పట్టించుకోలేదు. వాళ్లు పడిపోయారని కూడా ఆమె గ్రహించలేదు. పిల్లల అరుపులు కూడా తను వినలేదు. మొత్తం ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లో మునిగిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు వెళ్లి చెప్పే వరకు కూడా ఆండ్రియా ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షంగా చాట్ చేస్తోంది. తర్వాత విషయం తెలుసుకున్న ఆమె తనకు ఏమి తెలియదని, తాను అమాయకురాలినని బుకాయించింది. ఆ సమయంలో తాను పెద్ద కుమారుడితో వేరే గదిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. కానీ పిల్లలు కిటికీ ఎక్కలేరని ఆమె చెప్పింది.