వివరాల్లోకి వెళితే.. బెంగళూరు, కెంపెగౌడ రోడ్డులో నివాసముంటే స్వర్ణకారుడైన శంకర్ కుమారుడు సాహిల్ శంకర్. ఇతడికి పుట్టిన రోజును ఘనంగా జరపాలని నిర్ణయించిన ఆయన స్నేహితులు, బంధువులను ఆహ్వానించాడు. కేట్ కట్ చేసి వేడుక ముగిసిన తర్వాత డిన్నర్‌కు సిద్ధమయ్యారు.
అయితే సాహిల్, అతడి స్నేహితుడు ఆర్యన్ ఓ గదిలోకి వెళ్లారు. అక్కడ ఓ గాజు సీసాలో నిల్వ చేసిన సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను చూసిన వారు దానిని కూల్ డ్రింక్‌గా భావించి తాగేశారు. వెంటనే కుప్పకూలిపోయారు. యాసిడ్ తాగిన చిన్నారులను ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.