పోలీసుల కథనం మేరకు, సోమవారం రాత్రి 7.30 గంటలకు పుల్వామా జిల్లా థోక్ ప్రాంతంలోని తాత్కాలిక శిబిరం నుంచి అబ్దుల్ ఖదీర్ (రాజౌరీ జిల్లా వాసి), మన్సూర్ అహ్మద్ (శ్రీనగర్ వాసి) అనే ఇద్దరు గుజ్జర్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో, ఆ మిలిటెంట్ల కోసం భద్రతాబగలాలు ముమ్మరంగా గాలిస్తున్నారు.
పుల్వామా జిల్లా అటవీ ప్రాంతంలో బుల్లెట్లతో ఛిద్రమైన వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో జరిగిన తొలి ఉగ్రవాద హింసాకాండ ఇదే. ఈ సందర్భంగా జమ్ముకాశ్మీర్ డీజీపీ దిల్ బాల్ సింగ్ మాట్లాడుతూ, గుజ్జర్ యువకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాద గ్రూపును మట్టుబెడతామని చెప్పారు.