ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రమంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఇందులో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికిదాగా రైల్వే భూములను లీజుకు ఇచ్చే అవకాశమే లేకపోగా తాజాగా ఈ స్థలాలను ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకునే వెసులుబాటును కేంద్ర మంత్రివర్గం కల్పించింది.