ఇండియాలో కూడా ఫేస్ బుక్ అంత పని చేసిందా?

శుక్రవారం, 8 జూన్ 2018 (12:00 IST)
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‍బుక్‌పై రోజురోజుకీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల సమాచార భద్రతా ఉల్లంఘనకు సంబంధించి ఇటీవలే అమెరికా కోర్టు ఆ సంస్థకు అక్షింతలు వేసింది. దీనిపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్పందిస్తూ వినియోగదారుల విశ్వాసానికి విఘాతం కలిగిన మాట వాస్తవేమని అంగీకరించి, ఇకపై అటువంటి ఉల్లంఘనలకు తమ సంస్థ పాల్పడదని హామీ ఇస్తూ క్షమాపణలు కూడా కోరుతున్నాడు.
 
అయితే భారత్‌లో కూడా ఇప్పుడు ఫేస్‌బుక్‌పై ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ వినియోగదారుల సమాచారాన్ని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలతో పంచుకున్నట్లు కథనాలు రావడంతో, దీనిపై కేంద్రం స్పందిస్తూ ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో జూన్ 20 లోపు వివరణ ఇవ్వాలని ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. వినియోగదారుల నుండి ఎలాంటి అనుమతి పొందకుండానే వారి సమాచారాన్ని మొబైల్, ఇతర పరికరాల తయారీ సంస్థలకు పంచుకున్నట్లు ఆరోపించిన కథనాలు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో దీనిపై కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొంది.
 
దీనిపై ఫేస్‌బుక్ స్పందిస్తూ, వినియోగదారుల సమాచార భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వ సందేహాలకు సమాధానమిస్తామని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు