ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు... పాక్ ప్రగల్భాలపై మంత్రి మనోహర్

గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:31 IST)
యురి దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై పాకిస్థాన్ చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు. 
 
యురి దాడి అనంతర పరిస్థితిపై బుధవారం మనోహర్ పరీకర్ విలేకరులతో మాట్లాడారు. ఉరీ దాడి విషయంలో ఏదో పొరపాటు జరిగిందని వ్యాఖ్యానించారు. దాన్ని సరిదిద్ది అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉరీ దాడికి కారకులను శిక్షించి తీరుతామని పరీకర్‌ ఉద్ఘాటించారు. 
 
ఇకపోతే భారతపై అణు యుద్ధానికీ వెనకాడబోమన్న పాకిస్థాన్‌ హెచ్చరికపై ఆయన కాస్తంత వ్యంగ్యంగా స్పందించారు. ఓటి కుండకు శబ్దం ఎక్కువన్నారు. అందువల్ల పాకిస్థాన్ ప్రగల్భాలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి