దసరా పండుగ రోజున దేవుడికి నాలుకను నైవైద్యంగా పెట్టిన భక్తులు!!

సోమవారం, 26 అక్టోబరు 2020 (12:19 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేవలం నేరాలు ఘోరాలకు మాత్రమే అడ్డాగా మారిందని ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ సంఘటన ఈ రాష్ట్ర వాసుల్లో మూఢభక్తి కూడా ఎక్కువగా ఉందనే విషయాన్ని రుజువు చేస్తోంది. 
 
దసరా పండుగ పర్వదినం రోజున ఈ రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. బాబేరు ప్రాంతంలోని భాటి అనే గ్రామంలోని ఆలయంలో 22 ఏళ్ల యువకుడు తన నాలుకను కోసుకున్నాడు. దాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు.
 
తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ ఘటనపై సదరు యువకుడి తండ్రి మాట్లాడుతూ, తన కుమారుడి మానసికస్థితి సరిగా లేదని చెప్పారు. నవరాత్రి సందర్భంగా నాలుక కోసుకున్నాడని తెలిపారు.
 
ఉత్తరప్రదేశ్‌లోనే ఆదివారం ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కురారా ప్రాంతంలోని కోకేశ్వర్ శివాలయంలో 49 ఏళ్ల రుక్మిణి మిశ్రా అనే వ్యక్తి కత్తితో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు