ప్రియురాలి మోసం.. ఫేస్‌బుక్ లైవ్‌లోనే ఆత్మహత్య.. ఎక్కడ?

గురువారం, 10 నవంబరు 2022 (23:08 IST)
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలి నమ్మకద్రోహాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అంతే ఫేస్‌బుక్‌లో వీడియో తీస్తూ లైవ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజా గంజ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. 
 
అయితే తన ప్రేయసి ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో ప్రియురాలు తనకు ద్రోహం చేసిందని నమ్మిన ఆ వ్యక్తి.. ఫేస్‌బుక్ లైవ్‌లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
తన ప్రేయసి.. ఆమె కుటుంబీకుల కారణంగానే తన ప్రాణాలను తీసుకున్నట్లు తెలిపాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు