పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

ఠాగూర్

గురువారం, 15 మే 2025 (11:44 IST)
తమకు పురుషులపై నమ్మకం పోయిందని, అందుకే తాము పెళ్లి చేసుకున్నట్టు ఇద్దరు యువతులు తెలిపారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పురుషులపై అయిష్టతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ఇద్దరు యువతులు తెలిపారు. కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఆ ఇద్దరు యువతులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తమ విషయంలో మన దేశ చట్టాలు అంగీకరించకపోయినప్పటికీ తామిద్దరం మాత్రం కలిసి జీవిస్తామని ప్రకటించారు.
 
యూపీలోని బదాయి జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో మంగళవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత మూడు నెలలుగా మంచి స్నేహితులుగా ఉంటున్న ఈ యువతులు ఇకపై జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమ వివాహానికి న్యాయపరమైన మద్దతు కోరుతూ కోర్టు ప్రాంగణంలో ఓ న్యాయవాదిని సంప్రదించారు. సమాజంలో భార్యాభర్తలుగా జీవించడానికి అవకాశం కల్పించాలని వారు అభ్యర్థించారు. అయితే, భారతీయ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని సదరు న్యాయవాది ఆ ఇద్దరు మహిళలకు స్పష్టం చేశారు. 
 
అయినప్పటికీ వారిద్దరూ తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. పురుషులతో కలిసి జీవించడం తమకు ఇష్టం లేదని, తమ కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా, చట్టం తమ వివాహాన్ని గుర్తించకపోయినా తాము కలిసే జీవిస్తామని దృఢంగా పేర్కొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలోన శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు