ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ ప్రాంతానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్.. కాసేపు బాధ్యతలను పక్కన పెట్టి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. పీపీఈ కిట్లు ధరించిన ఆ వ్యక్తి పని ఒత్తిడిని జయించేందుకు పెళ్లి ఊరేగింపులో నాట్యం చేశాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి సుశీలా తివారీ మెడికల్ కాలేజీ సమీపంలో జరిగింది.