చార్ ధామ్ యాత్రలో విషాదం నెలకొంది. 12 రోజుల్లోనే 31 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు కారణం అనారోగ్య సమస్యలే. మే నెలలో ప్రారంభమైన ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రలో ఈ విషాదం నెలకొంది. బీపీ, గుండెనొప్పి, మౌంటెన్ సిక్ నెస్ వంటి వాటితో 12 రోజుల్లోనే 31 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
అటు, అనారోగ్యంతో ఉన్న వారు, కోలుకున్న తర్వాతే యాత్రకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హెల్త్ స్క్రీనింగ్ చేపట్టింది ప్రభుత్వం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నవారినే యాత్రకు అనుమతిస్తున్నారు.
అలాగే, పండుకేశ్వర్ దగ్గర మరో హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. దోబట, హైనా, బద్రినాథ్ దామ్ యాత్రికుల కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.