యూపీ సీఎం జంతుప్రేమ... కుక్క, కోతి, చిరుత, మొసలి, కొండచిలువ.... ఇంకా...

బుధవారం, 22 మార్చి 2017 (19:51 IST)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జంతుప్రేమ అపారమని ఆయన గురించి తెలిసినవారు చెప్పేమాట. ఐతే అది వాస్తవమని ఈ ఫోటోలను చూస్తే తెలుస్తుంది. ఆయన గోరఖ్‌నాథ్‌ ఆలయ పరిసరాల్లో ఉండే కుక్క, పిల్లి, కోతులు తదితరల జంతువులపై ఆయనకు ఎనలేని ప్రేమను కురిపిస్తుంటారు. 
 
రోజూ ఆయన జంతువుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి వాటికి ఆహారాన్ని వేస్తుంటారట. అలాగే కొన్ని రోజుల క్రితం భారత్‌-నేపాల్‌ సరిహద్దులో చిరుత పిల్ల అరుస్తూ కనపడటంతో దాన్ని పట్టుకువచ్చి తులసిపూర్‌లోని ఆశ్రమానికి తీసుకువచ్చి కొన్ని నెలలపాటు అక్కడే పెరిగింది. ఇలా ఆయన జంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు.
 
మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో గోవుల అక్రమ రవాణాపై ఆయన పూర్తిగా నిషేధం విధించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఉన్న జంతు వధశాలలను మూసివేతకు ప్రణాళికలు రచించాలని ఆయన అధికారులను కోరారు. గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం విధించారు. తాను జారీ చేస్తోన్న‌ ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని ఆయ‌న‌ తేల్చిచెప్పారు.
(ఫోటో కర్టెసీ: సోషల్ నెట్వర్కింగ్)

వెబ్దునియా పై చదవండి