ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పిల్లలపై కరోనా టీకా కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ సహా దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, ఇందు కోసం తాము 18 మంది చిన్నారులను ఎంపిక చేశామని ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు, కరోనా మూడో దశ ప్రభావం చిన్నారులపై అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్లినికల్ ట్రయల్స్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే ఈ పరీక్షలకు డీజీసీఐ అనుమతులు ఇచ్చింది.
ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటిని చిన్న పిల్లలకు వేసేందుకు ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదన్న విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా, కెనడా, జపాన్, చైనా వంటి పలు దేశాలు తమ దేశాల్లో పిల్లలకు టీకాలు వేసేందుకు అనుమతులు ఇచ్చాయి.