స్మార్ట్ ఫోన్ కొంటే టమోటాలు ఫ్రీ - టమోటా దుకాణానికి ఎస్కార్ట్ భద్రత.. ఎక్కడ?

సోమవారం, 10 జులై 2023 (08:59 IST)
దేశ వ్యాప్తంగా టమోటాల ధర విపరీతంగా పెరిగిపోయింది. అనేక రాష్ట్రాల్లో కేజీ టమోటాలు సెంచరీ ధరను దాటిపోయాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన ఓ మొబైల్ కంపెనీ వ్యాపారి అభిషేక్ వినూత్నంగా ఆలోచన చేశాడు. తమ షాపులో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్‌కు రెండు కేజీల టమోటాలను ఉచితంగా ఇస్తానంటూ ప్రకటన చేశారు. దీంతో అతని షాపులో స్మార్ట్‌ ఫోన్లు అమ్మకం సంగతి అటుంచితే షాపుకు మాత్రం విపరీతమైన ప్రచారం లభించింది. 'ఆఫర్ ప్రకటించిన తర్వాత తన దుకాణానికి వచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది అని అభిషేక్ చెప్పాడు.
 
మరోవైపు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అజయ్ ఫౌజీ అనే టమోటాల వ్యాపారి తన దుకాణానికి ఏకంగా ప్రైవేటు భద్రతను నియమించుకున్నారు. వినియోగదారులు దుకాణాలకు ఎగబడటమే కాక, కొన్ని చోట్ల చోరీలు కూడా చేస్తున్నారని, అందుకే భద్రత కోసం బౌన్సర్లను దుకాణం వద్ద మోహరించామని తెలిపారు. 
 
మరోవైపు, తమిళనాడులోని కడలూరుకు చెందిన రాజేశ్.. తన కూరగాయల దుకాణం నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 550 కిలోల టమోటాలను రూ.20కి కిలో చొప్పున విక్రయించాడు. కిలోకు రూ.20 అని ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే అన్ని టమోటాలు అమ్ముడు పోయాయని ఆయన తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు