కరోనా వార్డు నుంచే మన్‌కీబాత్ వీక్షించిన మధ్యప్రదేశ్ సీఎం

ఆదివారం, 26 జులై 2020 (15:23 IST)
Shivraj Singh Chouhan
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా వార్డులో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వార్డు నుంచే ఆయన ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ కార్యక్రమాన్ని తిలకించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఆయన భోపాల్‌లోని చిరాయు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ కార్యక్రమాన్ని కరోనా వార్డులో ఉన్న టీవీ ద్వారా వీక్షించారు. మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 26 వేలు దాటగా ఇప్పటి వరకు 791 మంది మరణించారు.
 
మరోవైపు దేశంలో కరోనా వైరస్ తొలిదశలోనే ఉందని, కానీ ఇంకా ప్రమాదకరమేనని ప్రధాని మోదీ అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతయినా అవసరమని ఆయన కోరారు. ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి తన 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రసంగిస్తూ.. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ పరిస్థితి ఇతర దేశాలకన్నా మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు.
 
లక్షల మంది ప్రాణాలను రక్షించగలిగామని, అయితే దీని ముప్పు ఇంకా తొలగిపోలేదని అన్నారు. టెస్టిగుల సంఖ్య పెరిగిందని, దీంతో మరణాల సంఖ్య కూడా చాలావరకు తగ్గిందని మోదీ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు .కార్గిల్ అమర వీరులకు ఆయన నివాళి అర్పించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు