ఛత్తీస్గఢ్ ఆలయంలో ఎలుగుబంటి శివలింగాన్ని కౌగిలించుకున్న వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన భక్తులంతా 'హర్ హర్ మహాదేవ్' అని జపిస్తున్నారు. శివలింగం, ఎలుగుబంటి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పది లక్షలకు పైగా వీక్షణలను సాధించింది.