హైదరాబాద్‌కు చెందిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేశారు. మెడలో భారీ గొలుసులు, చేతులకు కడియాలు, ఉంగరాలతో సహా ఒంటిపై దాదాపు ఆరు కిలోల బంగారాన్ని ధరించి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల కారణంగా తిరుమలలో విపరీతమైన జనం ఉన్నారని, ఇంత భారీ మొత్తంలో బంగారం ధరించి తిరగడం సురక్షితం కాదని విజయ్ కుమార్‌కు సూచించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.