సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన ఆయన ముందుగా సూర్యాపేట జిల్లాలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలను పరిశీలించారు.
సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని, పంట, ఇతర నష్టాలపై అధికారులు తనకు ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలిపారు.
ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి వివరించి, వారి మద్దతు కోరినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఎకరం భూమిలో పంటనష్టం వాటిల్లితే రూ.10వేలు పరిహారం చెల్లిస్తామన్నారు.