యూపీ కాంగ్రెస్ నేతకు తగిన శాస్తి.. అందరూ చూస్తుండగానే..?

ఆదివారం, 1 నవంబరు 2020 (20:31 IST)
Congress leader
యూపీలోని జలాన్‌కు చెందిన అనూజ్ మిశ్రా అనే కాంగ్రెస్ నేతకు తగిన శాస్తి జరిగింది. లైంగిక వేధింపుల కారణంగా అందరూ చూస్తుండగానే కాంగ్రెస్ నేతను చెప్పులతో దేహశుద్ది చేసిన ఘటన ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జలాన్‌కు చెందిన అనూజ్‌ మిశ్రా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం అనూజ్‌ మిశ్రా జలాన్‌ సమీపంలోని ఒరై రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇంతలో స్టేషన్‌వైపు వస్తున్న ఇద్దరు యువతులపై అనూజ్‌మిశ్రా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడడమే గాకుండా లైంగిక వేధింపులకు గురిచేశాడు.
 
దీంతో ఆగ్రహించిన సదరు యువతులు అనూజ్‌ మిశ్రాను పట్టుకొని తమ చెప్పులతో దేహశుద్ది చేశారు. చివరికి అనూజ్‌మిశ్రా క్షమించమని మహిళ కాళ్లు మీద పడ్డా అ‍ప్పటికే కనికరించలేదు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని అనూజ్‌ మిశ్రాను విడిపించి అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు