హనుమాన్ శోభాయాత్ర - పూలవర్షం కురిపించిన ముస్లిం సోదరులు

ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (11:22 IST)
హనుమాన్ శోభాయాత్రలో ముస్లింలు మత సామరస్యాన్ని చూపించారు. ఈ శోభాయాత్రపై ముస్లిం సోదరులు పూలవర్షం కురిపించారు. జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ, తమ భక్తిని చాటుకున్నారు. ఈ శోభాయాత్రలో దాదాపు ఐదు వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. అలాగే, ఈ యాత్రలో పాల్గొన్న హిందూ భక్తులకు ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అపరూప దృశ్యం భోపాల్‌లో జరిగింది. 
 
అయితే, హ‌నుమాన్ శోభాయాత్ర నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా అన్ని షాపుల‌ను మూసి వేయించారు. అయితే, ఖాజీ క్యాంప్ ఏరియాలో శోభాయాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. దీంతో వేరే మార్గంలో శోభాయాత్ర‌ను కొన‌సాగించారు. ఈ శోభాయాత్రను పురస్కరించుకుని భోపాల్ న‌గ‌రం కాషాయం జెండాల‌తో మెరిసిపోయింది. 

 

#WATCH Madhya Pradesh | People from the Muslim community shower flower petals on devotees during the Hanuman Jayanti procession in Bhopal yesterday pic.twitter.com/3d3riqgo22

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 17, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు