జయలలిత, యడ్యూరప్ప బ్యారక్‌లోనే చిన్నమ్మ.. కోర్టులో లొంగిపోనున్న శశికళ

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (10:18 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్‌ను సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో బుధవారం బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌ కూడా కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో లొంగిపోతారని తెలుస్తోంది. శశికళ తన లీగల్ అడ్వైజర్ల సూచన మేరకు కోర్టు ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 
 
కోర్టులో లొంగిపోయిన తర్వాతే రివ్యూ పిటిషన్ వెళ్దామని ఆమెతో వారు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో కోర్టు ఎదుట లొంగిపోవాలని శశికళ నిర్ణయించుకున్నారు. చిన్నమ్మను లొంగిపోయిన వెంటనే శశికళను పరపనగ్రహారలోని కేంద్ర కారాగారినికి తరలించనున్నారు పోలీసులు. గతంలో జయలలిత, బీఎస్ యడ్యూరప్ప ఉన్న బ్యారక్‌లోనే శశికళను కూడా ఉంచే అవకాశం ఉంది. ఈ క్రమంలో బెంగళూరు, కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

వెబ్దునియా పై చదవండి