వీధి కుక్కల దాడిలో గాయపడిన ప్రాణాలు కోల్పోయిన వాఘ్ బక్రీ టీ యజమాని

మంగళవారం, 24 అక్టోబరు 2023 (09:31 IST)
ఢిల్లీలో విచిత్రమైన దారుణ ఘటన ఒకటి జరిగింది. వీధి కుక్కల దాడిలో వాఘ్ బక్రీ టీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ప్రాణాలు కోల్పోయారు. ఈయన వయసు 49 సంవత్సరాలు. వీధి శునకాల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనకు మెదడులో రక్తస్రావం కావడంతో ఆదివారం ప్రాణాలు కోల్పోయినట్టు ఆ కంపనీ వీడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గతవారం ఆయన ఇంటికి సమీపంలో వీధి కుక్కలు దాడి చేయడంతోనే పరాగ్ దేశాయ్ కింద పడినట్టు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ దాడి విషయం భద్రతా సిబ్బంది నుంచి కుటుంబ సభ్యులు తెలుసుకొని ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నాయి. కిందపడిన సమయంలో ఆయన తనకు బలమైన గాయమైనట్లు సన్నిహితులు తెలిపారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించగా, మెదడులో రక్తస్రావం వల్ల తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు.
 
వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో పరాగ్ దేశాయ్ ఒకరు. కంపెనీని ఈ-కామర్స్‌ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కంపెనీ సేల్స్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్టు విభాగాల కార్యకలాపాలను పరాగ్ పర్యవేక్షించేవారు. ఆయన అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. 
 
వాఘ్ బక్రీ గ్రూప్‌ను 892లో నరన్స్ దేశాయ్ ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్ రూ.2,000 కోట్లు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా, పరాగ్ దేశాయ్ మృతిపట్ల కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హా గోహిల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు