బరువు తగ్గాలని ఉందా.. అయితే, సీబీఐకు కాల్ చేయండి: కార్తి చిదంబరం

మంగళవారం, 13 మార్చి 2018 (16:11 IST)
మీలో ఎవరికైనా బరువు తగ్గాలని ఉందా? అయితే, సీబీఐకు కాల్ చేయండి. సీబీఐ కస్టడీకి వెళ్లండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. బరువు తగ్గిపోతారు అంటూ కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తనయుడు కార్తి చిదంబరం ఏకంగా సీబీఐపైనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసుల్లో కార్తి చిదంబరంను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో 12 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న ఆయన ఈ మేరకు అనుభవపూర్వకంగా సెటైర్లు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. బరువు తగ్గాలంటే జిమ్‌కి వెళ్లడం, కఠినమైన ఆహార నియమాలు పాటించడం అవసరం లేదన్నారు. సీబీఐ కస్టడీలో ఉన్నా లేక ఆ సంస్థ క్యాంటీన్ తిండి తిన్నా ఆటోమేటిక్‌గా బరువు తగ్గిపోతారంటూ కార్తీ వ్యాఖ్యానించారు. 
 
ఇపుడు నాకు ఆకలి పూర్తిగా చచ్చిపోయింది. చాలా తక్కువ ఆహారం తింటున్నాను. అందువల్ల చాలా వరకు బరువు తగ్గిపోయాను. ఒకరకంగా ఇది మంచిది కూడా. నా పాత బట్టలన్నీ వదులైపోయాయి. ఇప్పుడు నాకు కొత్త బట్టలు కావాలి. ఎవరైనా బరువు తగ్గాలంటే సీబీఐకి కాల్ చేయండి అని మీడియా సమక్షంలో నవ్వుతూ సీబీఐపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు