స్కూల్ భవనమే కదా అని లైట్‌గా తీసుకోలేదు.. తళతళా మెరిసేలా శుభ్రం చేశారు...

బుధవారం, 22 ఆగస్టు 2018 (09:29 IST)
కాయకష్టం చేసి కూడబెట్టుకున్న సొమ్ముతో పాటు తమ సరస్వం కోల్పోయినప్పటికీ కేరళ ప్రజలు మాత్రం తమ వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని మాత్రం కోల్పోదు. వర్షాలు, వరదల్లో తమకు ఆశ్రయమిచ్చిన స్కూలు భవనాన్ని తళతళా మెరిసేలా శుభ్రం చేశారు.


అదీ కూడా ప్రొఫెషనల్ నిపుణులు సాఫ్ట్‌వేర్ కంపెనీ అద్దాలను శుభ్రం చేసినట్లు తళతళా మెరిసేలా క్లీన్ చేసి మరీ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
సాధారణంగా, మనం బస్సులు, రైళ్లలో ప్రయాణించినప్పుడు బిస్కెట్ ప్యాకెట్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ఇలా మనకు పనికిరాని ప్రతి వ్యర్థాన్ని అక్కడే వదిలివేసి వెళ్ళిపోతుంటాం. ఆ తర్వాత ఆ సంస్థలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వచ్చి వాటిని శుభ్రం చేస్తారులే అని లైట్ తీసుకుంటారు. 
 
అయితే కేరళ ప్రజలు మాత్రం అలా అనుకోలేదు. భారీ వరదలకు సర్వస్వం కోల్పోయినా తమకు ఆశ్రయం ఇచ్చిన స్కూలు భవనాన్ని చెత్తచెత్తగా మార్చేయలేదు. ప్రొఫెషనల్ నిపుణులు సాఫ్ట్ వేర్ కంపెనీ అద్దాలను శుభ్రం చేసినట్లు తళతళా మెరిసేలా క్లీన్ చేసి మరీ వెళ్లారు.
 
కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కూన్నమవు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.. భారీ వర్షాలకు ఇళ్లు, పొలాలు దెబ్బతినడంతో గ్రామానికి చెందిన 1,200 మంది ప్రజలు ప్రభుత్వ హైస్కూలు నాలుగో అంతస్తులో ఆశ్రయం తీసుకున్నారు. నాలుగురోజుల తర్వాత వరద తగ్గడంతో ప్రజలు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లేముందు స్కూలు గదులను తళతళా మెరిసేలా శుభ్రం చేసి వెళ్లారు.
 
ఈ విషయమై ఓ మహిళను మీడియా ప్రశ్నించగా..'ఈ స్కూల్ భవనమే నాలుగు రోజుల పాటు మాకు ఆశ్రయమిచ్చింది. అంటే ఇది మాకు ఇంటితో సమానం. దీన్ని అపరిశుభ్రంగా ఎలా వదిలేయను? మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి కదా?' అని వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్నప్పటికీ కేరళ వాసులు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు