వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు అంత త్వరగా తగ్గవు . ఒక్కోసారి మందులు వాడినా ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు మన ఇంట్లోనే ఉన్న కొన్ని పదార్థాలతో దగ్గుని తగ్గించుకోవచ్చు. వాత, పిత్త, కఫ దోషాల వలన దగ్గు వస్తుంది. ముఖ్యంగా దగ్గు మూడు రకాలుగా వస్తుంది. కఫంతో పాటు వచ్చే దగ్గు, కఫం లేకుండా వచ్చే దగ్గు, కంఠం లోపల గాయాల వల్ల రక్తంతో కలిసి కఫం వస్తుంది. దీనిని తీవ్ర స్థితిగా గుర్తించాలి. మరి ఈ దగ్గుని తగ్గించుకొనే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.