తాము పక్కా హిందుత్వవాదులమని, మరాఠా గడ్డపై దాదాగిరిచేస్తే అణిచివేస్తామని, తమ రౌద్రం చూపిస్తామంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. ఎవరైనా హనుమాన్ చాలీసా పఠించాలనుకుంటే పఠించుకోవచ్చన్నారు. అంతేకానీ, హనుమాన్ చాలీసాను అడ్డుంగా చేసుకుని దాదాగిరి చేస్తే మాత్రం సహించే ప్రస్తక్తే లేదని హెచ్చరించారు. దాదాగిరి అణిచివేయాలో తమకు బాగా తెలుసన్నారు.
పైగా, తాము పక్కా హిందుత్వవాదులమని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ గనుక దాదాగిరి చేస్తే తమ భీమ రూపారన్ని మహా రౌద్రాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. గదాధరుడైన హనుమంతుడుగా తమ హిందుత్వ భూమిక చాలా స్ట్రాంగ్‌గా ఉందని పేర్కొన్నారు.
అదేసమయంలో తాము హిందుత్వ వాదాన్ని, భూమికను విడిచిపెట్టినట్టు బీజేపీ పదేపదే అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. హిందుత్వ అంటే కేవలం ధోవతి కట్టుకోవడమేనా? అంటూ ప్రశ్నించారు. హిందుత్వ విషయంలో తమను విమర్శించే వారు ఇంతకు వారు హిందుత్వకు ఏం చేశారో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు.