విచిత్ర విషాద ఘటన : భార్య మీద పడటంతో ప్రాణాలు విడిచిన భర్త... ఎందుకో తెలుసా?

మంగళవారం, 5 జులై 2016 (11:01 IST)
సాధారణంగా భర్తల వల్ల భార్యలు ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ, ఇక్కడో విచిత్రం జరిగింది. భర్త మీద భార్య పడటంతో అతను ప్రాణాలు కోల్పోయిన విచిత్ర విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాజ్‌కోట్‌లోని రామ్ దామ్ సొసైటీలో మంజుల, నట్వర్ లాల్‌లు అనే దంపతులు ఉన్నారు. మంజుల సుమారు 128 కిలోల బరువు ఉంటుంది. వీరి కుమారుడు అశిష్, కోడలు నిశాలు పై అంతస్తులో కాపురముంటున్నారు. 
 
అయితే, ఆశిష్ శ్వాసపీల్చడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మందులు తెచ్చేందుకు భార్య నిశా కిందకు దిగి వచ్చింది. ఆ సమయంలో కొడుకును చూసేందుకు తల్లిదండ్రులు పైఅంతస్తులోకి వెళ్లేందుకు హడావుడిగా మెట్లెక్కుతున్నారు. 
 
ఈ క్రమంలో మంజుల కాలు జారీ వెనకే వస్తున్న భర్తపై పడింది. దీంతో ఆయన మృతిచెందారు. అలాగే, ఈ ఘటనలో గాయపడిన మంజుల కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నిండింది.

వెబ్దునియా పై చదవండి