ఏపీ సీఎం జగన్‌కు మమత లేఖ.. ఆ భేటీకి గైర్హాజరు

గురువారం, 16 జూన్ 2022 (17:29 IST)
దేశ రాజకీయాలన్నీ రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయంగా తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ- రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ నిలబెట్టే అభ్యర్థి గెలుపును అడ్డుకుని..తమ సత్తా చాటే దిశగా పావులు కదుపుతున్నాయి.
 
జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే బాధ్యతను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీసుకున్నారు. ఆయా పార్టీల నేతలో దేశ రాజధానిలో సమావేశాన్ని నిర్వహించారు. 
 
సీపీఐ, సీపీఎం సీపీఐఎంఎల్, రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాది పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్), డీఎంకే, రాష్ట్రీయ లోక్‌దళ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు దీనికి హాజరయ్యారు.
 
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న యూపీఏ కూటములకు సమదూరాన్ని పాటిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్‌ నాయకులకు కూడా ఆహ్వానం అందినప్పటికీ.. వారు గైర్హాజయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు